ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఇతర అధికారులతో కలిసి సమావేశం బుధవారం నిర్వహించారు. ఏ రకం ధాన్యం క్వింటాలకు 2320, సాధారణ రకానికి 2300 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. రైతుల కోసం అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.