కన్నేపల్లి: హత్యకు సహకరించిన వ్యక్తి రిమాండ్
కన్నెపల్లి మండలం శాలిగాం పంచాయతీలో గోమాస నరేందర్ హత్యకు సహకరించిన భీమారం మండలానికి చెందిన బానోత్ రామును రిమాండ్ కు తరలించినట్లు తాండూర్ సీఐ కుమారస్వామి శనివారం తెలిపారు. గత నెల 15న గోమాస నరేందర్ ను ఆయన మామ శంకర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడని పేర్కొన్నారు. హత్యకు సహకరించిన రామును అరెస్టు చేసినట్లు వెల్లడించారు.