రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండలు బాణేష్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి గ్రామంలో రైతులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయి మూడు నెలలు గడుస్తున్నా రైతు భరోసా ఊసే లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఖాతాల్లో వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.