నెన్నెల మండలంలోని చిన్న లంబడి తండా, పెద్ద లంబడి తండా, నార్వాయిపేట, చిన్న వెంకటాపూర్, కొత్తూరు గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలపై మంగళవారం పోలీసులు ఆబ్కారి శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 800 మీటర్ల బెల్లం పానకం, 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ లక్ష్మణ్, ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.