బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో సాఫ్ట్ బేస్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తొమ్మిదవ సబ్ జూనియర్, యూత్ జాతీయ సాఫ్ట్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ 2024 -25 పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి క్రీడా జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.