కన్నేపల్లి మండలంలోని టేకులపల్లి క్రాస్ రహదారి వద్ద గంజాయి తరలిస్తున్న సర్కారు రాజు, శామీర్ బరాయి అనే వ్యక్తులను పోలీసులు గురువారం పట్టుకున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు. కాగజ్ నగర్ చెందిన వీరు బైక్ పై గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి వారి వద్ద 1100 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని రేచిని గ్రామానికి చెందిన ప్రవీణ్ కు విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.