ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని బీజెపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి బూతులో 200 సభ్యత్వాలు పూర్తి కావాలని పేర్కొన్నారు. బెల్లంపల్లిలో 100 సభ్యత్వాలు పూర్తి చేసిన వారిని ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు.