బెల్లంపల్లిలో ఏర్పాటు చేయబోతున్న 62 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ కమిటీ అధ్యక్షుడు రాజేష్ కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తే చాలామందికి ఉపాధి దక్కుతుందని వెల్లడించారు.