సాఫ్ట్ బేస్ బాల్ ఆట ఆడి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ అక్కడి క్రీడాకారులను, ప్రజలని ఉత్సాహపరిచారు. బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో మంగళవారం రాత్రి నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాఫ్ట్ బేస్ బాల్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే వెల్లడించారు.