కాగజ్ నగర్ కు చెందిన డ్రైవర్ పాముల పురుషోత్తంను బండరాయితో మోది అద్దెకు తెచ్చిన కారుతో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్ఘలొద్దిన్ గురువారం తెలిపారు. కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు
వెళుతుండగా బెల్లంపల్లి హనుమాన్ విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకొని కొద్ది దూరం వెళ్ళాక మూత్ర విసర్జనకు డ్రైవర్ ను దించి బండరాయితో మోది కారుతో పారారైనట్లు పేర్కొన్నారు.