బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా అంబలి పంపిణీ చేశారు. ఖాతా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దాత కోడి రమేష్ సహకారంతో నిరుపేదలు, యాచకులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, బాటసారులు, చిరు వ్యాపారులకు అంబలి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.