ప్రతి కార్మికుడు తప్పనిసరిగా కనీసం ప్రతి నెలలో 16 మాస్టర్లు చేయాలని శాంతిఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా సూచించారు. గైర్హాజరు హాజరవుతున్న గనికి చెందిన కార్మికులకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో 16 కన్నా తక్కువ మస్టర్లు చేసిన కార్మికులను పిలిచి గైర్హాజరు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో గైర్హాజరు కాకుండా విధిగా డ్యూటీలు చేసుకోవాలని సూచించారు.