వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల అత్యవసర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం శనివారం హెచ్ఏఎం పథకం నుంచి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రూ. 11. 44 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయా శాఖల సంబంధిత మంత్రులకు తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.