తెలంగాణలో ఉండే ప్రతి నిరుద్యోగి తమ కాళ్లపై తాము నిలబడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్న తరహా ఇండస్ట్రియల్లో స్వయం ఉపాధి కల్పనపై యువతకు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమానికి హాజరయ్యారు. మేఘారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తూ మరో వైపు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలోనూ నిరుద్యోగులకు జాబ్స్ ఇప్పించాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు.