సీపీఆర్ శిక్షణను సద్వినియం చేసుకొని గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలో శుక్రవారం లైఫ్ సేవర్ అసోసియేషన్ ఢిల్లీ వైద్య నిపుణుల బృందం సీపీఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తి గుండె కొట్టుకోవడం స్తంభించి శ్వాస తీసుకోని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే సీపీఆర్ చేయాలని కలెక్టర్ అన్నారు.