ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి రాష్ట్ర స్థాయి బాలికల కుస్తీ పోటీలు ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. నాయకులు సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తేవాలని ఆయన కోరారు.