నారాయణపేట విద్యుత్ శాఖలో పని చేస్తున్న సంజీవ రెడ్డి ఎస్ఈగా పదోన్నతి పొందారు. మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఆయనను తన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ, జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, సహాయ కార్యదర్శి ప్రభు, ఉపాధ్యక్షుడు బాలప్ప, తదితరులు పాల్గొన్నారు.