విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, తాండాలలో విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇటీవల విద్యుత్ సీఎండిని కలిసి నియోజకవర్గానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే విషయంపై చర్చించామని తెలిపారు.