నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి అశోక్ డిమాండ్ చేసారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇల్లు లేని వాళ్లు ఉన్నారని, ఎప్పుడు కూలే ఇంట్లో ఉండలేక అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్నారన్నారు. వెంటనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.