కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సాగర్ అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చేవారని అన్నారు.