మక్తల్: పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని అందించిన ఎమ్మెల్యే

61பார்த்தது
మక్తల్ పట్టణంలోని సుప్రసిద్ధ పడమటి ఆంజనేయ స్వామి వారికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం పంచలోహ హనుమాన్ విగ్రహాన్ని ఆలయానికి అందించారు. ఇంటి నుండి ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో పూజలు చేసి ఆలయ అర్చకులకు అందించారు. మొత్తం 18 కేజీల బరువు వున్న ఉత్సవ హనుమాన్ మూర్తిని అందించారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி