మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఫార్మ రైతు బాధితులను సోమవారం పరామర్శించారు. రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినప్పుడు, వారిని పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని ఆమే అన్నారు. పార్లమెంటు సమావేశ అనంతరం ఇచ్చిన మాట ప్రకారం నేడు రైతులను పరామర్శించడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బాధితులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.