రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటి సర్వే కార్యక్రమం పారదర్శకంగా జరుగుతుందని సోమవారం ఓబీసీ సెల్ మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లేష్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 14వ వార్డు వీరన్నపేట ప్రాంతంలో అధికారులతో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే కొనసాగుతుందన్నారు.