గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. బాలానగర్ మండలం దేవునిగుట్ట తండాలో కోటి రూపాయలతో, తిమ్మారెడ్డిపల్లిలో కోటి 13 లక్షలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అభివృద్ధి వేగవంతమైందని అన్నారు.