జడ్చర్లలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

81பார்த்தது
జడ్చర్లలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఆదివారం బిగ్ షాక్ తగిలింది. కావేరమ్మపేట 1వ వార్డు కౌన్సిలర్ ఫెహ్ మీనా నాజ్, బిఆర్ఎస్ నేత షేక్ బాబాతో పాటు 300మంది కార్యకర్తలు ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీతినిజాయితీకి మారుపేరని కొనియాడారు. కార్యకర్తలు అధైర్య పడొద్దు, కష్టపడి పని చేసిన వారందరికీ నా మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி