మత్స్యకారుల అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల సమీపంలోని సంఘాల చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులకు ఆదాయ వనరుగా ఉన్న చేప పిల్లల పెంపకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీని కల్పించిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు.