స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ వెంకట్రాములును జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ సాయుధ దళ విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రాములు పోలీసు శాఖలో 32 ఏళ్ల పాటు తమ సర్వీస్ ను పూర్తి చేసుకొని నేడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారని తెలిపారు.