దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కన్మనూరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ఫ్రైడే డ్రై డే' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధికారులు, అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.