తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోసారి కీలక ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పాలన ప్రచారాలకే పరిమితమని.. పథకాల అమలులో మాత్రం శూన్యమని ఆరోపించింది. జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాలను రేవంత్ సర్కార్ అటకెక్కించిందని దుయ్యబట్టింది. 'పత్తా లేని ఇందిరమ్మ ఇండ్లు.. జాడలేని పింఛన్లు.. కానరాని రేషన్ కార్డులు.. గప్పాలు కొట్టడానికే పరిమితం అవుతున్న రేవంత్ రెడ్డి అండ్ కో' అంటూ మండిపడింది.