BRS పార్టీ ఈ నెల 27న వరంగల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా భారీ ఎత్తున రజతోత్సవ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు 3,000 బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి బీఆర్ఎస్ నాయకులు లేఖ ఇచ్చారు. మూడు వేల బస్సులకు అవసరమయ్యే రూ. 8 కోట్ల చెక్ ను ఆర్టీసీ ఎండీకి వారు అందజేశారు. దీనిపై సజ్జనార్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.