IIHTకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు

64பார்த்தது
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీని తెలంగాణ ప్ర‌భుత్వం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా IIHTకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్ట‌నున్న‌ట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలైన త్యాగమ‌ని కొనియాడారు.

தொடர்புடைய செய்தி