HCU భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన ఘటనపై మాజీ సీఎం KCR స్పందించారు. విద్యార్థులపై లాఠీఛార్జి అమానుషమన్నారు. రేవంత్ పాలనలో అవగాహన రాహిత్యం కనిపిస్తోందని, తప్పులపై తప్పులు చేస్తున్నారని KCR విమర్శించారు. 15 నెలల కాలంలోనే మహిళలు, విద్యార్థులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల్లోనూ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు.