కొత్తగూడెం కేసీఓఏ క్లబ్ లో బుధవారం రెడ్డి సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా రెడ్డి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని రెడ్డి బంధువులంతా ఏకం కావాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు కోసం శ్రమించాలన్నారు. నిరుపేద కుటుంబాలకు వైద్య, విద్య సేవలను అందించాలని కోరారు. ఈ క్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.