రెండు రోజులు మంచినీటి సరఫరాకు అంతరాయం

69பார்த்தது
రెండు రోజులు మంచినీటి సరఫరాకు అంతరాయం
ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ప్రవాహానికి మణుగూరు ఇంటెక్వెల్ చుట్టూ బురద మేట వేసిందని, సిల్ట్ ఇంటెక్వెల్లోని మోటార్లలోకి ప్రవేశించడంతో పంపులు సరిగా పని చేయడం లేదని మున్సిపాలిటి కమీషనర్ ఉమామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. మోటార్ పంపులు సక్రమంగా పని చేయనందున మరమ్మత్తుల పనులను చేపడుతున్నామని, రెండు రోజులపాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందన్నారు. మున్సిపాలిటీ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி