కొత్తగూడెం కలెక్టరేట్ లో తెలంగాణ ప్రభత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతుల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పూలతో పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామారెడ్డి బతుకమ్మ వేడుకల్లో మంగళవారం పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులను పలుకరిస్తూ వేదికకు చేరుకున్నారు.