బహిరంగ ప్రదేశాల్లో డీజే బాక్సులు ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. అధిక శబ్దం వచ్చే పరికరాల వినియోగంపై పోలీస్ చట్టం నిబంధనల ప్రకారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు నిబంధన అమలులో ఉంటుందన్నారు.