చంద్రుగొండ గ్రామానికి చెందిన దళిత మహిళను మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి లొంగదీసుకొని అనంతరం కులం పేరుతో దూషించిన కేసుపై మంగళవారం రాత్రి కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విచారణ జరిపారు. లారీడ్రైవర్ హమీద్ 32 ఏళ్ల మహిళను రెండు నెలల కిందట లొంగదీసుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురిచేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.