చర్ల మండల రైతు వేదికలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం సహాయనిధి లబ్ధిదారులకు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. పలు అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందించామన్నారు.