ములకలపల్లి మండల కేంద్రంలో బుధవారం ఇఫ్ట్ పోస్టర్ ను జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశంలో 14 రాష్ట్రాలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న 3 విప్లవ కార్మిక సంఘాలు ఒకే సంఘంగా ఏర్పడుతున్నాయని అన్నారు. గత 40 ఏళ్లుగా ఇఫ్ట్ గా పనిచేస్తున్న విప్లవ కార్మిక సంఘం పేరును టియుసిఐగా నామకరణం చేస్తూ అక్టోబర్ 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.