అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు గురువారం సమావేశం అయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి వినతిపత్రం ద్వారా సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.