కాగజ్‌నగర్ లోని అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విజయ్ ఖన్నాకి జిల్లా గెజిట్ కాపీ ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు దినసరి కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే కూలీలకు పాత గెజిట్ ప్రకారం వేతనాలు ఇస్తున్నారన్నారు. నూతన గెజిట్ జారీచేసి వేతనాలు ఇవ్వాలని కోరారు.