దహేగాం మండల కేంద్రంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం నాయకులు, యువకులు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. అనంతరం సంఘం మండల అధ్యక్షులు టేకం సుధాకర్ మాట్లాడుతూ.. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహాత్ముడని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్స రవీందర్, ఉపాధ్యక్షులు తుమ్మిడి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.