కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. గత మూడు రోజులుగా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు, డాక్టర్ లు తెలిపారు. ఆసిఫాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్ కు రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదారాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.