వైరా: ఒకేరోజు రూ. 10 కోట్ల మద్యం అమ్మకాలు
వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి గురువారం ఒకేరోజు రూ. 10కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు తీసుకెళ్లారు. రెండు రోజులుగా సర్వర్ పని చేయకపోవడంతో అమ్మకాలు నిలిచిపోయిన విషయం విదితమే. గురువారం ఉదయానికి సర్వర్ అందుబాటులోకి రావడంతో ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్ల యజమానులు మద్యం కోసం వాహనాలతో బారులు దీరారు. దీంతో ఒకేరోజు రూ. 10. 69కోట్ల విలువైన 13, 940 కేసుల మద్యం, 10, 013 కేసుల బీర్లను తీసుకెళ్లారు.