ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామ సమీపంలోని మిర్చి తోటలో చిరుతపులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రైతు శ్రీహరి తన పొలంలో చిరుతపులి పిల్లను చూసి వీడియో తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. అధికారులు వచ్చిన తర్వాత చిరుత అడుగుల జాడను గుర్తించారు. కనిగిరి గుట్టలు నుండి దారితప్పి చిరుతపులి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చుట్టూ ప్రక్కల గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.