కారేపల్లిలోని స్టేషన్ ఆవరణంలో ఎస్సై రాజారామ్ బుధవారం సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారని మొబైల్ ఫోన్ కి వచ్చే ఓటీపీలను ఎవరికి తెలియజేయరాదన్నారు. అకౌంట్లో అమౌంట్ కట్ అయిన, ప్రైవేట్ లోన్ యూపులకు మోసాల బారిన పడకుండా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆడపిల్లలు జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు.