మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీపై మత్స్యకారుల సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. గురువారం జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మత్స్యకారుల సొసైటీకి రాయితీపై ప్రభుత్వం అందించిన చేప పిల్లలను పంపిణీ చేశారు. మండలంలో ఏడు చెరువుల సొసైటీలకు 48, 750 చేప పిల్లలను అందించినట్లు తెలిపారు.