మధిర పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి సహకరించాలన్నారు. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఉన్నారు.