జూలూరుపాడు మండలంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని కోరుతూ మంగళవారం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కు బిఎస్పీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం వల్ల మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.