వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 11నుండి జోనల్ స్థాయి బాలికల క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి కొప్పుల స్వరూపరాణి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం ఆమె వివరాలు వెల్లడించారు. పోటీలకు ఉమ్మడి జిల్లాలోని 14 గురుకులాల నుంచి 1, 190 మంది బాలికలు హాజరవుతారని తెలిపారు. అండర్-14, 17, 19 విభాగాల్లో విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు.